• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • లై సినిమా రివ్యూ (11/8/17)

    Posted on 11 Aug, 2017 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/8/17..   04.30pm)
                అ.. ఆ’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం వలన ‘లై’ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.  

    కథ :
               ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..

    ప్లస్ పాయింట్స్ :
                సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.  నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
                ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి. అర్జున్ – నితిన్ లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడు ను చెడగొడతాయి.  
     
     
    Be the first one to comment. Click here to post comment!