• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ (11/8/17)

    Posted on 11 Aug, 2017 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/8/17..   04.30pm)
                  లీడర్, కృష్ణ వందే జగద్గురుమ్, ఘాజి’ వంటి సినిమాలతో మిగతా హీరోలకంటే తాను భిన్నమని చెప్పి ‘బాహుబలి’ తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన నటుడు రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

    కథ :
              ఒక ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ (కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు. స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా అందరికన్నా ఎత్తుకు ఎదిగే ప్రయత్నంలో తనకు తెలియకుండానే పూర్తిగా మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూ ముందుకెళుతుంటాడు. అలాంటి సమయంలో శత్రువులు అతన్ని అణగదొక్కడానికి అన్ని దారుల నుండి చుట్టుముడతారు. రాజకీయ చదరంగం లో చిక్కుకున్న రాధ జోగేంద్ర ఎలాంటి కష్టాల్ని పడ్డాడు, ఎవరెవర్ని కోల్పోయాడు, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, చివరికి అతని జీవితం ఏమైంది, అనేదే ఈ సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
             పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, ఆమెను అంటుకుని నడిచే జోగేంద్ర పాత్ర అద్భుతంగా పండాయి. రానా, కాజల్ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వీరి మధ్య నడిచే భార్య భర్తల ట్రాక్ ను తేర మీద చాలా అందంగా ఆవిష్కరించారు తేజ. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశమైతే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది. ఫస్టాఫ్ ఆరంభం నుండే ఏ మాత్రం ఆలస్యం లేకుండా సినిమా కథలోకి ప్రవేశించడం, జోగేంద్ర రాజకీయ రంగప్రవేశం చేసి, ఎదురనేదే లేకుండా ఎదిగిపోవడం వాటికి తోడు బలమైన పాత్రలు, వాటి నటన ప్రేక్షకుడు సినిమాతో పాటే ప్రయాణం చేసేలా చేశాయి. సెకండాఫ్ కు వచ్చే సరికి జోగేంద్ర పాత్ర కళ్ళ ముందే అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారి పోవడం, సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా క్లైమాక్స్ కు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. సినిమా చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే అనిపించింది. సినిమా ముగింపు కూడా లవ్ ట్రాక్ తో ముడిపడి ఉండి, పర్ఫెక్ట్ గా ఉంది. 

    మైనస్ పాయింట్స్ :
              సినిమా సెకండాఫ్ చివర్లో హీరో 200 మంది ఎమ్మెల్యేలను చంపడం, అందుకుగాను పడిన ఉరి శిక్ష తప్పే సన్నివేశాలు బలహీనంగా, లాజిక్స్ కు దూరంగా అనిపిస్థాయి. ఆ ఎపిసోడ్లో జనాల ఇన్వాల్మెంట్ కూడా ఓవర్ గా ఉండి మొహమాటపెడుతుంది. ప్రీ క్లైమాక్స్ అంకంలో వచ్చే అసెంబ్లీ సన్నివేశం పెద్దగా ఉద్వేగం, మాటలు లేకుండానే ముగిసిపోతుంది. ముందు నుండి కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు సరైన జస్టిఫికేషన్ కనబడదు. సినిమా ప్రధాన అంశం ప్రేమ కథే అయినా దాన్ని చెప్పడానికి దర్శకుడు ఎంచుకుంది రాజకీయ నైపథ్యం కాబట్టి వీటి రెండింటి మధ్య ఖచ్చితమైన బ్యాలెన్స్ ఉండాలి. ఇందులో రెండింటినీ పోల్చి చూస్తే రాజకీయ నైపథ్యానికి కాస్త అన్యాయం జరిగినట్టే అనిపించి కొంచెం నిరుత్సాహాం కలిగింది.
     
     
    Be the first one to comment. Click here to post comment!