• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ఆనందో బ్రహ్మ సినిమా రివ్వూ (18/8/17)

    Posted on 18 Aug, 2017 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/8/17...  05.00pm)
              ‘పాఠశాల’ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’ . ‘భలే మంచి రోజు’ చిత్ర నిర్మాతలు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  .
    కథ :
            మలేషియాలో నివసించే రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులు అనూహ్య రీతిలో చనిపోవడంతో హైదరాబాద్లో ఉండే తన ఇంటిని అమ్మేయాలనుకుంటాడు. అందులో దెయ్యాలున్నాయనే ప్రచారం వలన అతను తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇంటిని అమ్మలసి వస్తుంది. ఇంతలో సిద్దు (శ్రీనివాస్ రెడ్డి) తనకు కొంత డబ్బిస్తే ఆ ఇంట్లో దెయ్యాలు లేవని నిరూపించి మంచి ధర పలికేలా చేస్తానని రాజీవ్ కనకాలతో డీల్ కుదుర్చుకుంటాడు. ఒప్పందం ప్రకారం సిద్దు తమతో పాటే డబ్బు అవసరమున్న తులసి (తాగుబోతు రమేష్), రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్) లను కూడా ఆ ఇంట్లోకి తీసుకెళతాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన ఆ నలుగురు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ? ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు ? ఉంటే అవి ఏం చేశాయి ? అసలు రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? అనేదే ఈ సినిమా కథ.

    ప్లస్ పాయింట్స్ :
             సెకండాఫ్ ఇందులో దెయ్యాలకు, నలుగురు కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిశోర్ లకు మధ్య నడిచే హర్రర్ కామెడీ సన్నివేశాలు భలేగా నవ్వించాయి. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ ల కాంబినేషన్లో వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే షకలక శంకర్ చేసే స్పూఫులు, దెయ్యాల్ని భయపెట్టే విధానం కొత్తగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. తాగుబోతు రమేష్ ఎప్పటిలాగే తన నిషా నటనతో నవ్వుల్ని పూయించాడు. నలుగురు కామెడియన్లకు ఉన్న వైకల్యాల కారణంగా దెయ్యాలు భయపడటం అనే పాయింట్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది. సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ దశ వరకు బాగా నవ్వుకోవచ్చు. సినిమా ఆరంభంలో ఇంట్లో ఉన్నవారిలో దెయ్యాలు ఎవరు, మనుషులెవరు అనే కన్ఫ్యూజన్ కలిగేలా ఆయన రూపొందించిన సన్నివేశాలు గమ్మత్తుగా అనిపించాయి. ఇక సెకండాఫ్ చివర్లో రివీల్ అయ్యే కథలోని అసలు ట్విస్ట్ ఎమోషనల్ గా కొంచెం టచ్ చేసింది. సినిమా రన్ టైం కూడా తక్కువ కావడంతో హాయిగా సినిమా చూసే సౌలభ్యం కలిగింది.

    మైనస్ పాయింట్స్ :
                సినిమా ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగింది. మొదటి 10 నిముషాలు మినహా మిగతా సమయం మొత్తాన్ని పాత్రల్ని పరిచయం చేయడానికే ఉపయోగించుకోవడం, ఆ పాత్రల్లో కొన్నింటి నైపథ్యం బలహీనంగా ఉండటంతో మొదటి అర్థ భాగం కొంత చప్పగానే అనిపించింది. సినిమా చివర్లో ట్విస్ట్ రివీల్ అయిపోయాక క్లైమాక్స్ ఏమిటనేదాన్ని సులభంగా ఊహించేయవచ్చు. ఈ హర్రర్ కామెడీ సినిమాలో కామెడీని బాగానే అందించారు. హర్రర్ కు సరైన న్యాయం జరగలేదు. దెయ్యాలున్నప్పుడు అవి ఎక్కడో ఒక చోట ప్రేక్షకుల్ని కనీసం ఉలిక్కిపడేలా చేయాలి. కానీ ఇందులో అలా జరగలేదు. ఎక్కడా థ్రిల్ చేసే సీన్లు కనిపించలేదు.a
     
     
    Be the first one to comment. Click here to post comment!