• Jaithra Business Solutions
 • Category Banner Ad
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • యుద్ధం శరణం సినిమా రివ్యూ (8/9/17)

  Posted on 08 Sep, 2017 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/9/17.. 04.30pm)
                 వారాహి చలనచిత్రం అంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలను అందించే సంస్థగా మంచి గుర్తింపు ఉంది. నాగ చైతన్య ఇప్పుడున్న హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకొని ముందుకుపోతున్నాడు. మరో వైపు శ్రీకాంత్ చాలా ఏళ్ల తర్వాత హీరో నుంచి విలన్ గా టర్న్ తీసుకొని చేసిన చిత్రం ‘యుద్ధం శరణం’.  

  కథ :
               అర్జున్(నాగ చైతన్య) కు తన అమ్మ సీత(రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావు రమేష్), ప్రియురాలు అంజలి (లావణ్య త్రిపాఠి) అక్క, భావ, చెల్లి ప్రపంచం. తన ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయితో, ప్రేమని పంచె అమ్మ నాన్నలతో సంతోషంగా ఉంటూ మరో వైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకునే పనిలో ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనిది ఒక హ్యాపీ ఫ్యామిలీ.  అలాంటి తన జీవితంలో అనుకోకుండా అర్జున్ అమ్మ, నాన్న చనిపోతారు. వారి చావుకి నాయక్ (శ్రీకాంత్) అనే ఒక రౌడీ కారణం అని అర్జున్ కి తెలుస్తుంది. నాయక్, అర్జున్ అమ్మ, నాన్నని ఎందుకు చంపాడు? ఆ విషయం అర్జున్ కి ఎలా తెలుస్తుంది? తన అమ్మ, నాన్న చావుకి కారణం అయిన నాయక్ మీద అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమా కథ.

  ప్లస్ పాయింట్స్ :
                   హ్యాపీగా వెళ్ళిపోతున్న ఒక మామూలు కుర్రాడి ఫ్యామిలీ లైఫ్ లోకి సంబంధం లేకుండా ఒక రౌడీ ఎంటర్ అయ్యి మొత్తం వారి సంతోషాన్ని దూరం చేస్తే, ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని దర్శకుడు ఎంచుకొని చెప్పిన విధానం ఆకట్టుకుంది. మొదటి అర్ధం భాగంలో వచ్చే ఫ్యామిలీ అనుబంధం, వారి మధ్య చిన్న చిన్న ఎమోషన్స్ ప్రెజెంట్ చేస్తూ కొంత ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించాడు. ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ సెకండ్ హాఫ్ మీద చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. కథలో భాగంగా వచ్చే ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ లో పండించిన వినోదం కూడా ప్రేక్షకులకి భాగా కనెక్టవుతుంది. శ్రీకాంత్ చేసిన విలన్ పాత్ర సినిమాలో మేజర్ హైలెట్. అతను తన కళ్ళతో విలనిజాన్ని చూపిస్తూ చేసిన నాయక్ పాత్ర ఆకట్టుకుంది. నాగ చైతన్య పాత్ర చూసుకుంటే సింపుల్ అండ్ స్వీట్ లైఫ్ తో హ్యాపీగా వెళ్ళిపోయే యువకుడుగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి చావుకి కారణం అయిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమైన కొడుకుగా రెండు రకాల ఎమోషన్స్ ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్ గా లావణ్య పర్వాలేదనిపించుకుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మురళీ శర్మ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు కూడా ఎవరి పాత్ర పరిధి మేరకు వారు భాగానే చేశారు.

  మైనస్ పాయింట్ :
                   సినిమాలో ప్రధాన లోపం ఎమోషన్ లోపించడం. మొదటి అర్ధ భాగం చూసిన తర్వాత ప్రేక్షకులు చాలా ఎక్స్పక్టేషన్ పెట్టుకుంటారు. సెకండ్ హాఫ్ ఇంకా గొప్పగా, మైండ్ గేమ్ అద్బుతంగా ఉంటుందని ఆశిస్తారు. అయితే ఈ విషయంలో దర్శకుడు తడబాటు పడ్డారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే ఒక పెద్ద రౌడీని చాలా ఈజీగా హీరో ట్రాప్ చేసేయడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఇంటెలిజెంట్ గేమ్ అని చూపిస్తూ స్క్రీన్ ప్లేలో ఏదో చేయడానికి ట్రై చేసినా, అది కథని కన్విన్స్ చేయడానికి చేసినట్లు ఉంది తప్ప ప్రేక్షకుడుని కన్విన్స్ చేసే విధంగా మాత్రం లేదు. తల్లిదండ్రులు చనిపోతే హీరో పడే ఒక మానసిక సంఘర్షణని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ఎంచుకున్న కథనం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆడియన్స్ కోరుకునే పోరాటం సెకండ్ హాఫ్ లో కనిపించకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. మంచి కథని ప్రెజెంట్ చేయడంలో స్క్రీన్ ప్లేలో చేసిన పొరపాటు సెకండ్ హాఫ్ ని పూర్తిగా క్రిందికి దించేస్తుంది.
   
   
  Be the first one to comment. Click here to post comment!