• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • ఆర్టీసీ ‘దసరా’ ... 1200 ప్రత్యేక బస్సులు

    Posted on 12 Sep, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/9/17.. 09.30am)
                ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడంలో ప్రైవేటు- ప్రభుత్వ అనే తేడా లేకుండా పోయింది. దసరా సెలవుల్లో ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చేందుకు ఆర్టీసీ ఈనెల 21 నుంచి 50 శాతం అదనపు ఛార్జితో 1200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రోజువారీగా వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపుగా పూర్తయిపోయాయని అధికారులు తెలిపారు. దసరా ప్రయాణికులు అదనపు టికెట్‌ ధరలతోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక బస్సుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్‌ మధ్య నడవనున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాయలసీమలోని పలు పట్టణాలకూ బస్సులు తిరగనున్నాయి. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. 27న మూలా నక్షత్రం, 28న దుర్గాష్టమి, 29న మహర్నవమి, 30న విజయదశమి రోజుల్లో విజయవాడలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు భారీగా ఉంటారు. ఆ రోజుల్లో విజయవాడకు పెద్ద సంఖ్యలో బస్సులను నడపనున్నారు. ‘‘ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని, రద్దీ మేరకు అవసరమైనన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయరావు తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!