• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • మిల్క్‌ పార్లర్‌లో టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు (12/9/17)

    Posted on 12 Sep, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/9/17.. 04.30pm)
                   విజయవాడ నగరంలోని చౌదరిపేటలోని మన్నవ వారివీధిలో సాయిజ్యోతి మిల్క్‌ పార్లర్‌లో మంగళవారం టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేపట్టారు. జనాదరణ పొందిన విజయ బ్రాండ్‌ పేరుతో పార్లర్‌ యజమాని ఎటువంటి అనుమతులూ లేకుండా నకిలీ పాల ఉత్పత్తులు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రసాయనాలతో కూడిన ద్రావణాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పార్లర్‌ యజమాని ఆళ్ల సురేందర్‌బాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్సు అధికారులు తెలిపారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!