• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • 3,4,,5 వార్డులో ఇంటింటికి టిడిపిని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు (13/9/17)

    Posted on 13 Sep, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/17.. 10.30am)
                   పేదల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలోని 3,4,5 వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ టిడిపి అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. పట్టణంలో 82 ఎకరాల్లో 9500 ఇళ్లను నిర్మిస్తున్నామని, సొంత ఇంటి కలలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలను పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు, నాయకులే తీసుకువెళ్లాలని అన్నారు. ఎఎంసి చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు, టిడిపి నియోజకవర్గ మాజీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), రాష్ట్ర నాయకులు పార్ధసారధి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను టిడిపి అందిస్తుందని, ప్రతి కార్యకర్త పార్టీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాతం నాగలక్ష్మి, అల్లూరి నాగవల్లి తోట బోగయ్య, చంద్రశేఖర్ ఇందుకూరి రామలింగరాజు మెరగని నారాయణమ్మ, మద్దుల రాము, ముదునూరి సూర్యనారాయణరాజు, అభిరుచి రఘు, మైలబత్తుల ఐజాక్ బాబు, వేలూరి సుబ్రహ్మణ్యం, లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, వబిలిశెట్టి కనకరాజు, నసీమాబేగం, బాదరాల పుల్లేశ్వరరావు, పళ్ళ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!