• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలి..సిఐ వెంకటేశ్వరరావు (13/9/17)

    Posted on 13 Sep, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/17.. 04.30pm)
                వాతావరణ కాలుష్యంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతిందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచాలని వన్ టౌన్ సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేసి కుండీలతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా  సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలను పెంచడం నైతిన బాధ్యతని, ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. జైలు సూపరింటెండెంట్ దుర్గమహేష్ మాట్లాడుతూ మా జైలు ప్రాంగణంలో కూడా మొక్కలను నాటి పెంచుతామని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఎస్సై సాయిరాం, కానిస్టేబుల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
     
     
    Be the first one to comment. Click here to post comment!