• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • కేరాఫ్ సూర్య సినిమా రివ్యూ (10/11/17)

    Posted on 11 Nov, 2017 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/11/17.. 04.30pm)
                యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ‘నా పేరు శివ’ లాంటి క్రైమ్ థ్రిల్లర్ ను రూపొందించిన సుశీంథిరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

    కథ :
                సూర్య (సందీప్ కిషన్) కుటుంబం, స్నేహితులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి సమయంలోనే సాంబశివుడు అనే రౌడీ మూలాన అతని జీవితంలో కష్టలు మొదలవుతాయి. అతని ప్రాణ స్నేహితుడు మహేష్ (విక్రాంత్) ప్రాణాలకు కూడా అపాయం ఏర్పడుతుంది.
    అసలు సాంబశివుడు ఎవరు? అతను సూర్య జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు ? మహేష్ ను ఎందుకు చంపాలనుకున్నాడు ? సాంబ శివుడి నుండి సూర్య తాను స్నేహితుడ్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే కథ.

    ప్లస్ పాయింట్స్ :
                      సినిమాకు ప్లస్ పాయింట్ కథ స్నేహం నైపథ్యంలో నడవడమే. సినిమా మొత్తం హీరో, అతని స్నేహితుడి చుట్టూనే తిరుగుతుంటుంది. దూకుడు స్వభావం కలిగిన స్నేహితుడ్ని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం కొంత బాగుంటుంది. ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే కీలక మలుపు ద్వితియార్థంపై ఆసక్తిని రేపుతుంది. ఇక ప్రధాన విలన్ చేసే సీక్రెట్ క్రైమ్స్ బాగుంటాయి. సెకండాఫ్లో ప్రతినాయకుడు హీరో స్నేహితుడ్ని ఎందుకు చంపాలను కుంటాడు, అసలు హీరో సన్నిహితుల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు అనే ముఖ్యమైన అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విషయం రివీల్ అయ్యే సన్నివేశం కూడా బాగుంటుంది. హీరో చెల్లెలు ప్రాణా పాయంలో చిక్కుకోవడం, క్లైమాక్స్ లో హీరో తన వారిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఇక ప్రధాన పాత్రల్లో చేసిన సందీప్ కిషన్, విక్రాంత్ లు బాగా నటించారు.

    మైనస్ పాయింట్స్ :
               దర్శకుడు సుశీంథిరన్ కథకు స్నేహమనే నైపథ్యం ఎంచుకోవడం బాగానే ఉన్నా సరైన కథ, కథనాల్ని రాసుకోలేకపోయాడు. దీంతో సినిమా మొత్తం మీద మూడు సన్నివేశాలు తప్ప మిగతా అంతా రొటీన్ గానో లేకపోతే అనాసక్తిగానో సాగిపోయింది. మొదటి భాగం ఇంటర్వెల్ ముందు వరకు సినిమా అసలు కథలోకి ప్రవేశించకపోవడంతో సుశీంథిరన్ లాంటి దర్శకుడు ఎలాంటి పాయింట్ చెబుతాడో అనే ఆసక్తి నిరుత్సాహంగా మారిపోయింది. కథ కొద్దిగా రివీలైన తర్వాత అయినా సినిమా ఆసక్తిగా, ఉత్కంఠగా సాగుతుందా అంటే లేదు. పైన చెప్పినట్టు కేవలం మూడు సన్నివేశాల్లో తప్ప ఎక్కడా ఎగ్జైట్మెంట్ కలుగలేదు. సుశీంథిరన్ చేసిన ‘నా పేరు శివ’ లాంటి సినిమాను చూసి ఈ చిత్రాన్ని చూస్తే కేవలం ఆ స్థాయి గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం వలనే విఫలమయ్యారనే సంగతి స్పష్టమవుతోంది. సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రొమాంటిక్ ఫీల్ ను కలిగించలేదు. హీరోయిన్ మెహ్రీన్ ప్రిజాద కేవలం మూడు నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మధ్యలో వచ్చే రెండు పాటలు కూడా మెప్పించలేకపోయాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!