• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • గృహం సినిమా రివ్యూ (17/11/17)

    Posted on 17 Nov, 2017 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/11/17.. 04.30pm)
                     హీరో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం ‘అవల్’ తెలుగులో ‘గృహం’ పేరుతో శుక్రవారం విడుదలైంది.  
     
    కథ :
             డాక్టర్ క్రిష్ (సిద్దార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా) తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అదే సమయంలో వాళ్ళ పాక్కింట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చి చేరుతుంది. అలా వాళ్ళు చేరిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో విచిత్రకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లోని అమ్మాయి జెన్నీ (అనీషా ఏంజెలిన)ని ఒక దెయ్యం ఆవహిస్తుంది. ఆ దెయ్యం ఎవరు, దాని కథేమిటి, అది జెన్నీనే ఎందుకు ఆవహించింది, దాని బారి నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది ? అనేదే ఈ సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
                ప్రతి 10 నిముషాలకు ఒక హర్రర్ మూమెంట్ వస్తూ భయపెడుతుంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హడలెత్తించే విధంగా ఉండటంతో హార్రర్ సన్నివేశాలు మరింతగా ప్రభావం చూపాయి. ఈ సినిమాలో కేవలం హర్రర్ తప్ప ప్రేక్షకుడ్ని పక్కదారి పట్టింటే కామెడీ, లవ్, సెంటిమెంట్ ట్రాక్స్ వంటివి ఏమీ ఉండవు. దాంతో ఒక దెయ్యపు సినిమాని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది. హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో కనిపించే డార్క్ కాన్వాస్ ఈ సినిమా కనిపిస్తుంది. జెన్నీ పాత్రలో నటించిన అనీషా ఏంజెలిన మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చి ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా హర్రర్ మూమెంట్స్ తో నడిపి ఇంటర్వెల్ సమయంలో భయానకమైన సన్నివేశంతో మెప్పించిన దర్శకుడు క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో పాటు హర్రర్ సీక్వెన్స్ ను పెట్టి ఆకట్టుకున్నాడు.

    మైనస్ పాయింట్స్ :
                సినిమాలోని లోపమంటే కథ రొటీన్ గాన్ ఉండటం. ఒక ఇంట్లో ఒక కుటుంబం, వాళ్ళు అనివార్య కారణాల వలన చనిపోయి ఆత్మలుగా మారి కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళని కష్ట పెడుతుంటారు. ఆ ఇంట్లోని వాళ్ళు చివరికి ఎలాగోలా ఆ దెయ్యాల బారి నుండి బయటపడటం. ఇది చాలా సినిమాల్లో వాడిన కథాంశమే కాబట్టి క్లైమాక్స్ లోని ట్విస్ట్ మినహా ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడ ఏం జరుగుతుందో సులభంగానే ఊహించవచ్చు. దీంతో భయపడినా థ్రిల్ ఫీలయ్యే ఛాన్స్ దొరకలేదు.కొన్ని సన్నివేశాలు, పాత్రలు పాత హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగానే ఉంటాయి. వాటి ప్రవర్తన, సన్నివేశాలు నడిచే తీరు కాపీ కొట్టినట్టే ఉంది.  
     
     
    Be the first one to comment. Click here to post comment!