• vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • ఖాకి సినిమా రివ్యూ (17/11/17)

  Posted on 17 Nov, 2017 in Cinema |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/11/17.. 04.30pm)
                    తమిళమొలతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తి తాజా ద్విభాషా చిత్రం ‘ఖాకి’ శుక్రవారం విడుదలైంది

  కథ :
            1995 కాలంలో తమిళనాడు హైవే పరిసరాల్లో వరుసగా దోపిడీ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుకు సంబందించిన ఫైల్ అప్పుడే డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న ధీరజ్ (కార్తి) వద్దకు వస్తుంది. ఆ కేసు ఫైల్ చదివి ఆ దోపిడీ హంతకుల్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజలు చనిపోతారని నిర్ణయించుకున్న ధీరజ్ ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరుతాడు. విచారణ కోసం కొంతమంది టీమ్ తో కలిసి ప్రాణాలకు తెగించి దేశం మొత్తం తిరిగి కీలక ఆధారాలని సేకరిస్తారు ధీరజ్. వాటి ద్వారా కేసులోకి ఇంకాస్త లోతుగా వెళ్లి అసలు వాస్తవాల్ని కనుక్కుంటారు. ఆ వాస్తవాలు ఏంటి, ఆ దోపిడీ హత్యల వెనకున్న ముఠా ఎవరు, వాళ్ళ నైపథ్యం ఏమిటి , వాళ్ళను ధీరజ్ ఎలా పట్టుకున్నాడు అనేదే సినిమా. ఈ సినిమాను అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన పోలీసుల చర్యల ఆధారంగానే రూపొందించారు .
  ప్లస్ పాయింట్స్ :
                దర్శకుడు హెచ్.వినోత్ 1995 – 2005 ల మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఆసక్తికరమైన కేసును తీసుకుని, చాలా లోతుగా రీసెర్చ్ చేసి, వాస్తవాల్ని కనుక్కుని తయారుచేసుకున్న కథ, కథనాలే ఈ సినిమాకు ప్రధాన బలం. కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో దోపిడీ హంతకుల్ని పట్టుకోవడానికి పోలీసులు పడే శ్రమ, కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపించడంతో సినిమాకు ఎమోషనల్ గా కనెక్టైపోతారు ప్రేక్షకులు. ఇక దోపిడీ హంతకుల ముఠా హవేరియాలు ఎలా ఉంటారు, వాళ్ళ క్రూరత్వం ఎటువంటిది, వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీలు చేశారు అనే విషయాల్ని చాలా వివరంగా చూపించి ఆకట్టుకున్నారు. సన్నివేశాల మేకింగ్ కూడా చాలా సహజంగా ఉండి, నిజంగా కళ్ళ ముందు జరుగుతోందా అనిపించేలా ఉంది. కొన్ని సన్నివేశాలైతే ఊపిరి బిగబట్టేలా ఉంటాయి. ముఖ్యంగా సుమారు 15 నిముషాల పాటు సాగే ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్లోని కొన్ని సీన్లు, క్లైమాక్స్ పోలీస్ ఆపరేషన్ అయితే ఎంతో ఉత్కంఠగా సాగాయి. హీరో కార్తి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా కుదిరిపోయి, అప్పట్లో నిజంగా ఆ కేసును డీల్ చేసిన అధికారి కష్టాన్ని, ఇంటెలిజెన్స్, ధైర్య సాహసాల్ని తెరపై ఆవిష్కరించాడు.

  మైనస్ పాయింట్స్ :
             ఈ సినిమాలో పెద్దగా నిరుత్సాపరిచే మైనస్ పాయింట్స్ అంటూ లేవు. కమర్షియల్ టచ్ కోసం సినిమా ఆరంభంలో హీరో కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ ల లవ్ ట్రాక్ కొంచెం ఎక్కువైనట్టు తోస్తుంది. హీరో పాత్రకి ఇంకాస్త ఎక్కువ ఎలివేషన్, హీరోయిక్ టచ్ ఇచ్చి ఉంటే కథనంలోని తీవ్రత ఇంకాస్త పెరిగుండేది. సినిమా మొత్తం ఇంటెన్సిటీతో నడిచే పోలీస్ స్టోరీ కావడంతో సినిమాలో ఎక్కడా కామెడీ, ఊపునిచ్చే పాటలు వంటి కమర్షియల్ అంశాలకు తావుండదు. కాబట్టి కమర్షియల్ అంశాలని ఖచ్చితంగా కోరుకునే వారికి కొంత నిరుత్సాహం ఎదురవుతుంది.
   
   
  Be the first one to comment. Click here to post comment!