• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • యూత్ క్లబ్ లో ముగిసిన ఆలిండియా ర్యాంకింగ్‌ టెన్నిస్‌ పోటీలు (17/11/17)

    Posted on 17 Nov, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/11/17.. 04.30pm)
                     ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ ఎంతో ప్రత్యేకమైన క్రీడ అని భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు అన్నారు. గత కొద్ది రోజులుగా భీమవరం యూత్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ ఆవరణలో జరుగుతున్న ఆలిండియా ర్యాంకింగ్‌ టెన్నిస్‌ (అండర్‌-16,18 బాల, బాలికల) టోర్నీ శుక్రవారం రాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోషియేషన్‌ గౌరవాధ్యక్షుడు గోకరాజు వెంకట నర్శింహరాజు, కార్యదర్శి పేరిచర్ల సుభాష్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందిజేశారు. టెన్నిస్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డీఎస్‌, అసోషియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గాకుమార్‌, అసోషియేషన్‌ డైరెక్టర్‌ వేగేశ్న రామకృష్ణంరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
    విజేతల వివరాలు 
    అండర్‌-16 బాలికల సింగిల్స్‌:- డి.సంస్కృతి(టీఎస్‌) - లక్ష్మీసాహితిరెడ్డి (ఏపీ)పై గెలుపొందారు
    అండర్‌-16 బాలుర సింగిల్స్‌:- సంజిత్‌ దేవినేని (కర్ణాటక) - సీహెచ్‌ సంస్కార్‌ (గుజరాత్‌)పై విజయం సాధించారు
    అండర్‌-18 బాలికల సింగిల్స్‌:- డి.సంస్కృతి (టీఎస్‌) - జ్ఞానిత (ఏపీ)పై గెలుపొందారు
    అండర్‌-18 బాలుర సింగిల్స్‌:- సంజిత్‌ దేవినేని (కర్ణాటక) - అమాన్‌అయూబ్‌ఖాన్‌ (టీఎస్‌)పై విజయం సాధించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!