• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • కాస్మో క్లబ్ లో "Renault Capture" కారు launch (18/11/17)

    Posted on 18 Nov, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్(18/11/17.. 11.30am)
                   విశ్వరూప ఆటో మోటివ్ ప్రయివేట్ లిమిటెడ్ (రాజమహేంద్రవరం) వారి  "Renault Capture" కారును శనివారం భీమవరం కాస్మో పాలిటిన్ క్లబ్ లో విడుదల చేశారు.  క్లబ్ అధ్యక్షులు  గోకరాజు రామరాజు "Renault Capture" కారును ఆవిష్కరించి మాట్లాడారు. సెల్ఫ్ డ్రైవింగ్ కు  "Renault Capture" ఎంతో అనువుగా ఉందని, రెండురోజులపాటు కాస్మో పాలిటిన్ క్లబ్ లో ప్రదర్శన ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సేల్స్ మేనేజర్ రవిచంద్ర శేఖర్ మాట్లాడుతూ పెట్రోల్ (13 లి), డీజిల్ (20.3 లి) మోడల్స్ లో సరికొత్త కలర్స్ తో అందుబాటులో లభిస్తుందని, బేసిక్ మోడల్ 9.99 లక్షలకు లభిస్తుందని, వచ్చేనెలలో భీమవరంలో షోరూంను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో  సేల్స్ మేనేజర్ (రాజమహేంద్రవరం) రవికిరణ్, సత్యనారాయణ, సేల్స్ ఆఫీసర్ నరేష్, మాణిక్యాలరావు, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

     
     
    Be the first one to comment. Click here to post comment!