• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • జవాన్ సినిమా రివ్యూ (1/12/17)

    Posted on 01 Dec, 2017 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (01/12/17..     04.30pm)
                      సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  

    కథ :
             జై (ధరమ్ తేజ్) చిన్నప్పటి నుండి దేశమంటే భక్తితో పెరిగి పెద్దై డిఆర్డీవోలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే డిఆర్డీవో శాస్త్రవేత్తలు ఆక్టోపస్ అనే ఒక పవర్ ఫుల్ మిస్సైల్ సిస్టంను కనిపెడతారు. దాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఆ డీల్ ను కేశవ్ (ప్రసన్న)కు అప్పగిస్తారు. ప్రసన్న దాన్ని దొంగిలించడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తాడు. ఆ ప్లాన్ ను జై అడ్డుపడతాడు. దాంతో కేశవ్ జై కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అలా ఒకవైపు దేశం, మరోవైపు కుటుంబాన్ని కాపాడాల్సిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న జై ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఆక్టోపస్ ను క్రిమినల్స్ చేతిలోకి వెళ్లకుండా ఎలా కాపాడాడు అనేదే సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
             సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అంటే కథానాయకుడు దేశమా, కుటుంబమా అనే క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకోవడమే. ఆ పరిస్థితుల్లో హీరో ఎలా ఆలోచించాడు, ఏ నిర్ణయం తీసుకున్నాడు అనే అంశాల్ని బాగా హ్యాండిల్ చేశాడు రచయిత, దర్శకుడు అయిన బివిఎస్ రవి. ఒకవైపు దేశం కోసం పోరాడుతూనే కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో పడే తపన, చేసే ప్రయత్నాలు బాగున్నాయి. సెకండాఫ్లో హీరో తన కుటుంబంలోని ఫైల్యూర్స్, సక్సెస్ ల గురించి మాట్లాడే ఎమోషనల్ సన్నివేశాలు, అందులోని డైలాగులు మనసుకు హత్తుకున్నాయి. ఇక విలన్ హీరోతోనే తన పని చేయించుకోవాలనుకోవడం, అందుకోసం హీరోని రకరకాల ఇబ్బందులకు గురిచేయడం బాగుంది. ధరమ్ తేజ్ కూడా దేశమంటే భాద్యత కలిగిన యువకుడిగా బాగా నటించాడు. కాస్ట్యూమ్స్ దగ్గర్నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిలోను పర్ఫెక్షన్ చూపిస్తూ, పాటల్లో క్లాస్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు.మెహ్రీన్ కౌర్ కూడా పాత్ర పరిధి మేరకు గ్లామరస్ గా కనిపిస్తూనే ఆకట్టుకోగా నెగెటివ్ రోల్ లో ప్రసన్న నటన మెప్పించింది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

    మైనస్ పాయింట్స్ :
            దర్శకుడు బివిఎస్.రవి కథను మంచి లింక్ తోనే మొదలుపెట్టినా ఆద్యంతం దాన్ని అలాగే కొనసాగించడంలో విఫలమయ్యారు. ఆయన రాసుకున్న సన్నివేశాల్లో ఎక్కడా కొత్తదనమనేదే కనబడలేదు. చాలా సినిమాల్లో చూసినట్టుగానే హీరో విలన్ కు అడ్డుతగలడం, విలన్ అతన్ని కష్టపెట్టడం, చివరికి హీరో అతన్ని జయించడం అనే రెగ్యులర్ ఫార్మాట్లోనే సినిమాను నడిపారు. ఫార్మాట్ సాధారణమైనదే అయినా రేసీ స్క్రీన్ ప్లే, కొత్తగా అనిపించే సీన్లు రాసుకుని ఉంటే బాగుండేది.హీరో, విలన్ ఇద్దర్నీ ఆరంభం నుండి ఎగ్రెస్సివ్ గా, ఇంటెలిజెంట్స్ గా చూపించడంతో కథనం కూడా అలానే మంచి మైండ్ గేమ్ సన్నివేశాలతో వేగంగా నడుస్తుందని ఆశిస్తే అలాంటిదేం లేకుండా సాదా సీదాగా ఉండటంతో ఎక్కడా పెద్దగా ఉత్కంఠ కలుగలేదు. సినిమా చివరి వరకు ఇక విలన్ ని పట్టుకోవడం హీరోకి కష్టమేమో అనే భావన కలిగించి ఆఖరులో కేవలం ఒక్క ఫోన్ ద్వారా అతను పట్టుబడిపోవడం సిల్లీగా అనిపించింది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!