• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • రోప్ స్కిప్పింగ్ పెడరెషన్ అఫ్ ఇండియా వైస్ చైర్మన్ శేఖర్ రాజుకు సత్కారం (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17    ... 10.30am)
                 చేసేవృత్తిలో నిబద్దత కలిగిన ప్రతిభ వంతుడు శేఖర్ రాజు అని, ఆయనికి రోప్ స్కిప్పింగ్ పెడరెషన్ అఫ్ ఇండియా వైస్ చైర్మన్ గా ఎన్నికవ్వడం మన ప్రాంతానికే గర్వకారణమని భీమవరం వినియోగదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామరాజు, ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. స్థానిక ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం భీమవరం వినియోగదారుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల రోప్ స్కిప్పింగ్ పెడరెషన్ అఫ్ ఇండియా వైస్ చైర్మన్ గా ఎన్నికైన పీఈటీ జి పూర్ణచంద్ర శేఖర్ రాజుని సత్కరించారు. ఈ సందర్బంగా రామరాజు, రమేష్ నాయుడు మాట్లాడుతూ సొంత ఖర్చులతో స్పాట్స్ డెవలప్ చేస్తున్న శేఖర్ రాజు లాంటి పీఈటీలు లేరన్నారు. ఉపాధ్యక్షులు బ్రహ్మరాజు, రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర అధ్యక్షలు డీఎస్ రాజు మాట్లాడుతూ అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని, శేఖర్ రాజు మరిన్ని పదవులను అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ప్రకాష్, వి కరుణాకరరావు, కోశాధికారి సూర్యనారాయణరాజు, సభ్యులు నిమ్మల సుధకిరణ్, ప్రసాద్, రామకృష్ణంరాజు, రామభద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!