• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుద్దాం.. ఎమ్మెల్యే అంజిబాబు (06/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17    ... 10.30am)
                  భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుద్దామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలను బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రాహం వద్ద నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్నా ఆశించిన సుస్థిరమైన సమాజస్థాపనే మనందరి ధ్యేయమని అన్నారు. అంబేద్కర్ ప్రపంచ దేశాలు గౌరవించే వ్యక్తని, సామాన్య పౌరుని నైతిక అభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో మెంటే పార్ధసారధి, గాదిరాజు సత్యనారాయణ రాజు, కౌన్సిలర్ ఎద్దు ఏసుపాదం, యాళ్ల వెంకటేశ్వరరావు, పంతం సతీష్, తోట బోగయ్య, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, మలువలస రాము, మైలబత్తుల ఐజాక్ బాబు, కారుమూరి సత్యనారాయణమూర్తి, గంట సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు 
     
     
    Be the first one to comment. Click here to post comment!