• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • మావుళ్ళమ్మ అమ్మవారి 54వ వార్షికోత్సవ ఉత్సవానికి పందిర రాట (06/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17  ... 10.30am)
                  నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి, దేవస్థానంలో ఆధ్వర్యంలో జనవరి నెలలో ప్రారంభం కానున్న అమ్మవారి 54వ వార్షికోత్సవ ఉత్సవానికి బుధవారం ఉదయం 9.15 నిమిషానికి పందిర రాట ముహార్తాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను చేపట్టారు. సంఘ గౌర్వధ్యక్షులు రామాయణం గోవిందరావుచే పందిర రాట ముహార్తాన్ని చేసి రాట వేశారు. 30 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని, సంక్రాంతి నుంచి అమ్మవారి 54వ వార్షిక మహోత్సవాలను ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మానే పేరయ్య, కొప్పుల సత్తిబాబు, అడ్డాల రంగారావు, మహంకాళి, తుటారపు ఏడుకొండలు, సర్వేశ్వరరావు, ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!