• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • బాబ్రీమసీదును కూల్చివేతను నిరసిస్తూ వామపక్షపార్టీ నిరసన ర్యాలీ ధర్నా (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17.. 04.30pm)
                 బాబ్రీ మసీదులో కూల్చడం దేశ లౌకికతత్వ ప్రజాస్వామ్యానికి మయానిమచ్చ అని సిపిఎం డెల్టా కార్యదర్శి వర్గసభ్యులు జెఎన్ వి గోపాలన్ అన్నారు. బుధవారం వామపక్షపార్టీల ఆధ్వర్యంలో బాబ్రీమసీదును కూల్చివేతను నిరసిస్తూ నిరసన ర్యాలీ ధర్నా ప్రకాశం చౌక్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలనా అభివృద్ధి నిరోధకమని, మతం పేరుతో కలహాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ద్రోహపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. బాబ్రీమసీదు కూల్చి రాముడి గుడి కట్టాలనే కుట్ర మతం పేరుతో ప్రజలను రెచ్చ గొట్టడం కోసమేనని అన్నారు. సిపిఎం కార్యదర్శి ఎం సీతారాం,ప్రసాద్, బివి వర్మ, బి వాసుదేవరావు మాట్లాడుతూ మతంపేరుతో కలహాలు సృటించిన వారిని నేరేంద్రమోడీ ప్రభుత్వం మతసంస్థలు వారికీ సన్మానాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో ఎం వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, వి త్రిమూర్తులు, కిలారి మల్లేశ్వరరావు, ఆకుల రాము, కనుమూరి వేంకటపతి, రబ్బానీ, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!