• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • డిఎన్నార్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల .. 77 శాతం ఉత్తీర్ణత (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17.. 04.30pm)
                       డిఎన్నార్ కళాశాల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు విడుదల చేశారు. సెమిస్టర్ ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారని, విద్యార్థినులే ఉత్తీర్ణత శాతం పైచేయిగా ఉన్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పెన్మెత్స రామకృష్ణంరాజు మాట్లాడుతూ సెమిస్టర్ ఫలితాల్లో బిఏ 66 శాతం, బిఎస్సి 54.48 శాతం, బికాం 97.93 శాతం, బికాం (ఒకేషనల్) 89.35 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.  ప్రతిభ చాటిన విద్యార్థులను బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అభినందించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, ఉపాధ్యక్షులు కె రామకృష్ణంరాజు, కె శివరామరాజు, ఏఎస్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు, పివి రామరాజు, కె భాస్కర్రావు అధ్యాపకులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!