• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • నేటి తరానికి రామ జన్మభూమి చరిత్ర తెలియాలి.. కోటేశ్వరశర్మ (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (6/12/17.. 07.30pm)
                   నేటి తరానికి రామ జన్మభూమి చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ కార్యదర్శి కె.కోటేశ్వరశర్మ (దిల్లీ) పేర్కొన్నారు. భీమవరంలోని త్యాగరాజ భవనంలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ సాధన సమితి ఆధ్వర్యంలో అయోధ్యలోని కరసేవ జరిగి 25 ఏళ్లు పూర్తి కావడంతో అయోధ్య కరసేవక సమ్మేళన సభ బుధవారం ఏర్పాటు చేశారు. సభకు సమ్మేళన నాయకుడు పరిమి రాధాకృష్ణ అధ్యక్షతన వహించారు. కోటేశ్వరశర్మ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడిన వారి గురించి తెలియ జేయడానికి కరసేవక సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. 1992లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 207 మంది కరసేవలో పాల్గొన్నారని, వారిలో 97 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌లో అయోధ్య మందిరం పై చర్చించి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సత్య కామేశ్వరానంద ఆశ్రమానికి చెందిన ఆనంద సరస్వతిస్వామి, జగన్నాథపురం గీతా కుటీరం స్వామి సత్యానందగిరి, పలువురు కరసేవకులు ఆనాటి  అనుభవాలను గుర్తు చేశారు. అనంతరం కరసేవకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్‌ డాక్టర్‌ కొప్పర్తి వేణుగోపాలరావు, కోకన్వీనర్‌ మజ్జి మహేష్‌, వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, ఉద్దరాజు వేణుగోపాలరాజు, గరికిముక్కు సుబ్బయ్య, రాష్ట్ర భాజపా సమన్వయకర్త పురిగళ్ళ రఘురామ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిరాజు, ఎంఎల్‌ఎన్‌.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి డాక్టర్‌ చెట్లపల్లి జగన్మోహన్‌, పట్టణ నాయకులు గొంతెన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!