• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రమణరాజుకు సత్కారం (11/1/18)

    Posted on 11 Jan, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/18.. 04.30pm)
                          209వ బ్రెయిలీ జయంతి సందర్బంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అంధులకు చేస్తున్న సేవలకు గాను పట్టణానికి చెందిన వైద్యులు యువి రమణరాజుకు అవార్డు అందించడం అభినందనీయమని రోటరీ క్లబ్ హర్షం వ్యక్తం చేస్తూ రమణరాజును గురువారం సత్కరించారు. ఈ సందర్బంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఉన్నమట్ల కరుణాకరణరావు, కార్యదర్శి ఎస్వీ రామచంద్ర జయవర్మ మాట్లాడుతూ రమణరాజు అంధ విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే కాకుండా మానవ దృష్టితో ఆయన చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి బివి సుబ్బారావు, కంబాల రామారావు, తటవర్తి కాళీ గుప్తా, ఎస్ సాయిదుర్గాప్రసాద్, షేక్ బాబాజిసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!