• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • సోమేశ్వరునికి లక్షతులసి, బిల్వార్చన

    Posted on 12 Jan, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/01/18..  04.30pm)
                ధనుర్మాసం పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో జనార్దనస్వామికి లక్ష తులసి అర్చన, సోమేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉమాసోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పూజలు చేసినట్లు అధ్యక్షుడు వేలూరి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి బ్రహ్మజోశ్యుల కిరణ్‌కుమార్‌ తెలిపారు. రాత్రి లక్ష్మీనారాయణ హోమం, స్వాములకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రధానార్చకులు సోంబాబు, రామకృష్ణ, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వేగేశ్న రంగరాజు,  ఈవో కె.కేశవకుమార్‌, సిబ్బంది ప్రసాద్‌, రామకృష్ణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!