• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • ఓటును అమ్ముకుని దుర్వినియోగ చేయడం అప్రహస్వామిక చర్య (20/01/18)

    Posted on 20 Jan, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/01/18..     04.30pm)
               భారతీయుడిగా ఓటుహక్కు నీతి నిజాయితీ నిబంధలతో వేసి పౌరునిగా మన భాధ్యతను నిర్వర్తించాలని, ఓటును అమ్ముకుని దుర్వినియోగ చేయడం అప్రహస్వామిక చర్యని ఆర్టీసీ డిఎం గిరిధర్ కుమార్, టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎం దేవకుమార్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం రెవెన్యూ శాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వరంలో ఆర్టీసీ బస్టాండ్, టౌన్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో ఓటర్ ప్రతిజ్ఞ, ఓటు విలువ ఓటు అవఘనపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిధర్ కుమార్, దేవకుమార్ మాట్లాడుతూ ఓటు శాశ్వతమని, నోటు అశాశ్వతమని ఓటును వేయకపోవడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, జెఎస్ రామారావు,  కరిమెరక లక్ష్మి, బండారు ఆదిలక్ష్మి, రాము, రామ్మూర్తి, ఆలూరి నాగరాజు, విజయరత్నం తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!