• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ఈనెల 24,25న ఎస్ఆర్ కెఆర్ లో అప్లయిడ్ సైన్సు అండ్ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సు (21/1/18)

    Posted on 21 Jan, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/1/18..  04.30pm) 
                     భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 24,25వ తేదీల్లో అప్లయిడ్ సైన్సు అండ్ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆదివారం కళాశాలలో డైరెక్టర్ ఎస్వీ రంగరాజు ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా సదస్సు డైరెక్టర్ పి రామకృష్ణంరాజు, కో ఆర్డినేటర్ వేణురెడ్డి మాట్లాడుతూ 24న జరిగే ప్రారంభ కార్యక్రమానికి డైరెక్టర్ ఇనిస్టిట్యూట్ అఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అట్లైడ్ సైన్సెస్ డిఆర్ డివో అజయ్ కుమార్ సింగ్, అసోసియేట్ డైరెక్టర్ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ డిఆర్ డివో డి రాజేంద్రసింగ్, ఆంధ్ర యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ పి అవధాని, రిపబ్లిక్ అఫ్ కొరియర్ చెందున చుంగమ్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి వెంకటకృష్ణ పమ్మి, లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాయలంలో పరిశోధకులు ప్రతాప్ కొల్లు తోపాటు ప్రొపెసర్లు రెండురోజులపాటు జరిగే సదస్సులో పాల్గొంటున్నారని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!