• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • రైతుబజార్ లో రైతు వినియోగదారులతో ఓటు ప్రతిజ్ఞ (21/1/18)

    Posted on 21 Jan, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/1/18..  04.30pm) 
                     ఐదు సంవత్సరాలకొకసారి వచ్చే ఓటును దుర్వినియోగం చేసుకోకుండా మంచి సమర్ధత గల పాలకులకు ఓటు వేయాలని ఎస్టేట్ ఆఫీసర్ వినోద్ అన్నారు. భీమవరం రెవెన్యూ శాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రైతుబజార్ లో రైతు వినియోగదారులతో ఓటు ప్రతిజ్ఞ, కరపత్రాలు పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వినోద్ మాట్లాడుతూ ఓటుపై సంపూర్ణ అవగహన కలిగి ఉండాలని, రైతులు తమ ఓటును పవిత్రంగా వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కూనిశెట్టి సత్యనారాయణ, బొల్లం నారాయణ, తాతారావు, అప్పలనాయుడు, జిడ్డు త్రిమూర్తులు, హనుమంతరావు, కుక్కల బాల, ఎల్ విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!