• Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • సంప్రదాయబద్ధంగా ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం (21/1/18)

    Posted on 21 Jan, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/1/18..  04.30pm) 
                   భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల 27వ జాతర మహోత్సవాన్నీ ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వివిధ కళాకారుల నృత్యాలు, గరగల నృత్యాలు, శక్తి వేషధారణలతో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించారు. 22,23,24 వరకు చండి హోమం, మహిళలచే లక్ష కుంకుమార్చన, 25న పంచహారతులు, ముగింపు రోజున అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు 
     
     
    Be the first one to comment. Click here to post comment!