• Category Banner Ad
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • పద్మావత్ సినిమా రివ్యూ (24/1/18)

  Posted on 23 Jan, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (24/1/18..  11.00am)
             గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచి అల్లర్లు, కోర్టు కేసుల వరకు వెళ్లిన సంజయ్ లీలా బన్సాలి చిత్రం ‘పద్మావత్’ తెలుగు వెర్షన్  స్పెషల్ షో రూపంలో ప్రదర్శితమైంది. 


  కథ:
               మేవార్ రాజపుత్ మహారాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్), సింహళ యువరాణి అత్యంత సౌందర్యవతి పద్మావతి (దీపికా పదుకొనె)ని మనసుపడి వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. వారి జీవితం ప్రేమమయమై ఉండగా ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ఖిల్జీ (రణ్వీర్ సింగ్) దురహంకారంతో పద్మావతిపై మనసుపడతాడు. ఆమెను దక్కించుకోవాలనే తపనతో రావల్ రతన్ సింగ్ యొక్క చిత్తూర్ కోటపై తన అసంఖ్యాకమైన సైన్యంతో యుద్దానికి బయలుదేరతాడు. బయలుదేరిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రావల్ రతన్ సింగ్ తో యుద్ధం చేశాడా, రావల్ రతన్ సింగ్ అతన్ని ఎలా ఎదుర్కున్నాడు, పద్మావతి యుద్ధం చేయకుండానే అతన్ని ఎలా ఓడించింది అనేదే ఈ సినిమా కథ.

  ప్లస్ పాయింట్స్ :
           సంజయ్ లీలా బన్సాలి విజన్ ఆయన సన్నివేశాల్ని షూట్ చేశారు అనడంకన్నా చెక్కారు అనొచ్చు. ప్రతి ఫ్రేమును ఎంతో అందంగా, హుందాగా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారాయన. చిత్తూర్ కోట సెట్ అద్భుతంగా ఉంది. ఆనాటి రాజపుత్ వంశీయుల వైభవాన్ని కళ్ళకు కట్టింది. రాణి పద్మావతిగా దీపికా పదుకొనె వేషధారణ, రావల్ రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ ఆహార్యం గొప్పగా ఉన్నాయి. ప్రతి నాయకుడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటన శభాష్ అనేలా ఉంది. క్రూరత్వం, చాకచక్యం, జిత్తులమారితనం వంటి గుణాల్ని అలవోకగా పలికించి పాత్రకు ప్రాణం పోశారాయన. రాణి పద్మావతిగా దీపికా ప్రదర్శన కూడా ముచ్చటపడేలా ఉంది. ఆత్మగౌరవం, అందం, తెలివి కలిగిన రాణిగా ఆమె నటన అద్భుతం. వీరిద్దరి నటనతో సినిమా స్థాయి పెరిగి చూడాలనిపించేలా తయారైంది. ఫస్టాఫ్లో దీపికా, షాహిద్ కపూర్ ల మధ్య నడిచే లవ్ డ్రామా అందంగా ఉంది ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. ఎమోషనల్ గా నడుస్తూ రాణి పద్మావతి గొప్పతనం ఎటువంటిదో చూపే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మనసుని హత్తుకుంది. దీపికా నటన, విజువల్స్, నైపత్య సంగీతం అన్నీ కలిసి ఆ ఎపిసోడ్ ను గొప్పగా తీర్చిదిద్దాయి.

  మైనస్ పాయింట్స్ :
               చారిత్రక నైపథయంలో వచ్చే చిత్రం అందులోనే రాజులు రాజ్యాలు అంటే ఖచ్చితంగా యుద్ధ సన్నివేశాలని, గొప్ప హీరోయిజాన్ని ఆశిస్తాడు సగటు తెలుగు ప్రేక్షకుడు. కానీ అలాంటివేమీ ఇందులో పెద్దగా దొరకవు. బన్సాలీ చిత్రాల్లో మేజర్ గా ఉండే డ్రామానే ఇందులో కూడా ఎక్కువ శాతం ఉంటుంది. అది ప్రేక్షకులకు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.  ఫస్టాఫ్లో అల్లాఉద్దీన్ ఖిల్జీకి సంబందించి అతను సుల్తాన్ గా అవతరించడం, సెకండాఫ్ ఆరంభంలో ఖిల్జీ కోట నైపథ్యంలో జరిగే కీలకమైన సన్నివేశం వంటి కొన్ని సన్నివేశాలు లాజిక్స్ అందకుండా ఉంటాయి. పైగా కీలకమనిపించే కొన్ని సీన్లలో పెద్దగా లోతు ఉండదు. అన్నీ చాలా సింపుల్ గా జరిగిపోతుంటాయి.ఆఖరున వచ్చే యుద్ధ సన్నివేశంలో ఆశ్చర్యపోయే, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉండవు. ఇది కూడా యాక్షన్ ప్రియులకు నిరాశను కలిగించే విషయమే.
   
   
  Be the first one to comment. Click here to post comment!