• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • టచ్ చేసి చూడు సినిమా రివ్యూ (2/02/18)

    Posted on 02 Feb, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (2/02/18.. 05.30pm)
                      మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

    కథ :
                   అన్నిటికన్నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కార్తికేయ (రవితేజ) పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీఖన్నా)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యల వలన ఆమె అతన్ని దూరం పెడుతుంది. అలా వారి ప్రేమ కథ సాగుతుండగా కార్తికేయ చెల్లెలు ఒక హత్యను చూసి సాక్ష్యం చెబుతానని ముందుకొస్తుంది. ఆమెకు రక్షణగా నిలిచే ప్రయత్నంలో తన చెల్లెలు చూసిన హంతకుడు గతంలో తాను పోలీసాఫీసర్ గా ఉన్నప్పుడు డీల్ చేసిన ఒక కేసులో నిందితుడని తెలుసుకుని అతన్ని అంతం చేసేందుకు తిరిగి పోలీస్ గా మారుతాడు. అసలు కార్తికేయ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, ఆ క్రిమినల్ గతంలో అతన్నుండి ఎలా తప్పించుకున్నాడు, తిరిగి ఉద్యోగంలో చేరిన కార్తికేయ అతన్ని ఎలా అంతం చేశాడు అనేదే తెరపై నడిచే కథ.

    ప్లస్ పాయింట్స్ :
                   సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. ఫన్నీ ఫన్నీగా ఉండే రవితేజ క్యారెక్టర్ కొంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే అతనికి, రాశీఖన్నాకు మధ్యన లవ్ ట్రాక్ ఫన్ తో నిండి ఎంటర్టైన్ చేసింది. ఈ లవ్ ట్రాక్లో మనకు కామెడీ మాటల్తో, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో పాత చిలిపి రవితేజ కనిపిస్తారు. రాశీఖన్నా కూడా క్యూట్ గా కనిపిస్తూ, మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చి ఆకట్టుకుంది.  ప్రేక్షకుల్ని రవితేజ గతంలోకి తీసుకెళ్లే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. దీని వలన సెకండాఫ్ మీద ఆసక్తి నెలకొంది. నియమాల్ని, చివరికి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా డ్యూటీ చేసే రవితేజ పాత్ర బాగుంది. పోలీస్ అనేవాడు భాధ్యతల్ని, కుటుంబాన్ని బ్యాలన్స్ చేస్తూ ముందుకెళ్లాలని దర్శకుడు చెప్పిన పాయింట్ బాగుంది. వీటన్నిటి మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్, మురళీ శర్మల కామెడీ కొంత నవ్వించగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులకి కనెక్టవుతాయి.

    మైనస్ పాయింట్స్ :
                      సినిమాలో కొత్త కథ, అలరించే కథనం లేకపోవడమే ప్రధాన బలహీనత. మొదటి అర్ధభాగాన్ని లవ్ ట్రాక్, కామెడీతో ఏదోలా నడిపిన దర్సకుడు సెకండాఫ్లో తేలిపోయాడు. కొత్తదనం చూపకపోగా కనీసం ఎంటర్టైన్మెంట్ ను అందించలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత కాసేపు సినిమాని రవితేజ ముందుకులాగే ప్రయత్నం చేసినా రొటీన్, బోరింగ్ కథనం ప్రేక్షకులకి నీరసాన్ని తెప్పిస్తుంది. ఫస్టాఫ్ ప్రారంభమైన 45 నిముషాలకు కూడా అసలు కథేమిటో క్లారిటీ రాకపోవడంతో గమ్యంలేని ప్రయాణం చేసిన ఫీలింగ్ కలిగింది. అలాగే కథకు ప్రధానమైన ప్రతినాయకుడి పాత్రలో అస్సలు క్లారిటీ ఉండదు. ఆఖరులో కూడా కథను ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా హీరో సింపుల్ గా ముగించేయడం అసంతృప్తిని కలిగించింది. హీరో గతం కూడా పోలీస్ కోణంలో పర్వాలేదనిపించినా మిగతా అంశాల్లో రొటీన్, బోరింగా నడిచి ప్రేక్షకుల్లో కూడా నీరసాన్ని పెంచేంసింది.
     
     
    Be the first one to comment. Click here to post comment!