• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ఛలో సినిమా రివ్యూ (2/02/18)

    Posted on 02 Feb, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (2/02/18.. 05.30pm)
                     యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘ఛలో’. నూతన దర్శకుడు వెంకి కుడుములు దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయ్యింది.  

    కథ:
             హరి (నాగ శౌర్య)కి చిన్నతనం నుండి గొడవలంటే చాలా ఇష్టం. అందరు పిల్లలు ఆడుకుని ఆనందిస్తే హరి మాత్రం కొట్లాటల్లో సంతోషాన్ని పొందుతుంటాడు. అలా అతను పెరుగుతున్న కొద్ది గొడవలు కూడా ఎక్కువవుతుంటాయి.  దాంతో వాళ్ళ నాన్న అతన్ని హైదరాబాద్ నుండి ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉండే తిరుప్పురం అనే ఊరికి పంపిస్తాడు. కానీ ఆ ఊళ్ళో జనాలు మాత్రం రెండుగా విడిపోయి పగ ప్రతీకారాలతో బ్రతుకుతుంటారు. హరిని వాళ్ళ నాన్న ప్రత్యేకంగా అలాంటి ఊరికే ఎందుకు పంపాడు, ఆ ఊరి గొడవేంటి, ఆ ఊరు హరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేదే సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
                      దర్శకుడు వెంకి కుడుములు కొద్దిగా కొత్తగా అనిపించే కథాంశాన్ని ఎంచుకుని దానికి పుష్కలంగా కమర్షియల్ హంగులను దట్టించి రాసుకున్న కథనమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో దొరకని కొత్త తరహా ఫన్ ఈ సినిమాలో లభిస్తుంది. హీరో దగ్గర్నుండి కథలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ముఖ్య పాత్రలోనూ ఎంటర్టైన్మెంట్ ను చూపించిన దర్శకుడు చాలా చోట్ల నవ్వుకునేలా చేశాడు. సినిమా ఆరంభాన్ని హీరో పాత్ర చిత్రీకరణతో ఆసక్తిగా మొదలుపెట్టి మధ్య మధ్యలో సత్య, వైవా హర్ష, సుదర్శన్ వంటి కమెడియన్లతో తెలుగు, తమిళ వ్యక్తుల మధ్య నడిచే సరదా సరదా హాస్యాన్ని అందించి ఇంటర్వెల్ సమయానికి థ్రిల్ చేసే ట్విస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అలాగే హీరో హీరోయిన్ల మధ్యన కూడా రొటీన్ సినిమాల్లా కాకుండా కొంత ఫ్రెష్ గా అనిపించే లవ్ ట్రాక్ ను పెట్టి కథను నడిపాడు. సెకండాఫ్లో సినిమా కిందకి పడిపోతోంది అనే సమయంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ను ప్రవేశపెట్టి చాలానే పంచులు పేల్చి నవ్వులు పూయించాడు. హీరో నాగ శౌర్య, హీరోయిన్ రష్మిక మందన్నలు కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.

    మైనస్ పాయింట్స్ :
                       ఫస్టాఫ్ ఆరంభమైన కొద్దిసేపటికే కథకు ముఖ్యమైన తిరుప్పురం గ్రామంలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఊరిలోని జనాల మధ్యన ఉండే గొడవల్ని ఫన్ కోసం కొంత తేలిగ్గా చూపించడంతో సినిమాలో సీరియస్ నెస్ కొంత లోపించింది. అలాగే ద్వితీయార్థం ఫస్టాఫ్ ఇచ్చినంత ఎంటర్టైన్మ్నెట్ ను ఇవ్వలేకపోయింది. వెన్నెల కిశోర్ కామెడీ, కొన్ని ఫన్నీ సీన్స్ లేకుంటే ఫలితం కొంత తారుమారయ్యేదే.  ద్వితీయార్థంలో కథలోని కీలకమైన మలుపులు ఉండాల్సినదానికంటే, ఊహించిందానికంటే తక్కువ స్థాయిలో ఉండటం వలన సినిమా బలం కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. మరీ ముఖ్యంగా కొన్ని దశాబ్దాల నుండి జరుగుతున్న ఊరి గొడవల వెనకున్న కారణం, క్లైమాక్స్ లో కథ సుఖాంతమైన తీరు నవ్వు తెప్పించే విధంగానే ఉన్న కొంత సిల్లీగా ఉండటం ప్రేక్షకుడికి మింగుడుపడదు. ఈ ముఖ్యమైన చోట్ల దర్శకుడు కమర్షియాలిటీని తగ్గించి ప్రేక్షకుడి ఎమోషన్స్ కి ప్రియారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది.
     
     
    Be the first one to comment. Click here to post comment!