• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • పోరాటమే లక్ష్యం... ముగిసిన సీపీఎం రాష్ట్ర మహాసభలు (12/02/18)

    Posted on 12 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/02/18..  06.00pm)
                      పోరాటాలతో ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోవాలని కార్యకర్తలకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు ఉద్యమాలు చేసి పార్టీని విస్తరించారని, మరింత స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని కోరారు. కేంద్ర కమిటీ మీ నుంచి కోరేది అదేనని సృష్టం చేశారు. పార్టీ నాయకులకు పలు విషయాలపై మార్గదర్శకాలను ఇచ్చారు. మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగిన సీపీఎం 25వ రాష్ట్రమహాసభలు సోమవారంతో ముగిశాయి. ఈ సభలకు పార్టీలోని అతిరథ మహారథులంతా హాజరయ్యారు. పార్టీపెద్దలు సీతారాం ఏచూరి, ప్రకాష్‌కారాట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మూడు రోజులపాటు మహాసభలను పర్యవేక్షించారు. తొలిరోజు శనివారం బహిరంగ సభ, ప్రదర్శన, ప్రతినిధుల సభ, వామపక్ష పార్టీ నేతల సభ జరిగింది. బహిరంగ సభకు అధికసంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో భీమవరం పట్టణమంతా అరుణవర్ణంగా మారింది. రెండోరోజు ఆదివారం పూర్తి అంతరంగికంగా సాగిన సమావేశాల్లో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు. ప్రజాసంఘాల ప్రతినిధులు తమ సంఘాల సభ్యులతో వేర్వేరుగా కూర్చొని చర్చించుకున్నారు. ఈ సారాంశాన్ని ప్రతినిధుల సభకు చేరవేసి మహాసభ సూచనలు అందుకున్నారు. గత మూడేళ్లగా జరిగిన ఉద్యమాలపైనా చర్చించారు. రాబోయే మూడేళ్లలో చేపట్టేబోయే కార్యాచరణ రూపొందించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 27 తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించారు. వాటన్నింటినీ ఆమోదించారు. మొత్తంగా మూడురోజులపాటు జరిగిన సమావేశాల్లో 29 తీర్మానాలను ఆమోదించారు. ఆఖరిరోజు సాయంత్రం రాష్ట్ర కార్యవర్గ ఎంపికపై చర్చించి నూతన కమిటీని ఎంపిక చేశారు. మూడు రోజులపాటు మహాసభలు జరిగాయి. రెండోరోజు వామపక్ష పార్టీలు ఐక్యత, ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. మూడోరోజు 27 తీర్మానాలు ఉన్నాయి. రైతాంగం, కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు రాష్ట్రంలో ఉన్న అనేక అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. విత్తనచట్టంపై ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ అభిప్రాయాలను చెప్పారు. నేటి ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని మహాసభ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 80లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండడం లేదు.  పండించిన ధరకు గిట్టుబాటు ధర లేదు. నాణ్యమైన విత్తనాలు లేవు. రుణ సౌకర్యం లేక ప్రైవేటు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలువురు నాయకులు సభ దృష్టికి తీసుకొచ్చారు.  రాష్ట్రంలో నకిలీ విత్తనాల వల్ల ఏటా లక్షలాది ఎకరాల్లో రైతాంగం పంటలు నష్టపోతున్నారు. బహుళ జాతి విత్తన సంస్థల ప్రయోజనాలకోసం విత్తనచట్టాన్ని పక్కన పెట్టారు. తక్షణమే విత్తన చట్టం చేయాలని మహాసభ డిమాండు చేసింది.
     
     
    Be the first one to comment. Click here to post comment!