• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • శివ నామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు (13/02/18)

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/02/18..  10.00am)
                   హరహర మహాదేవ శంభో శంకరా.. అంటూ శివ నామస్మరణతో పంచారామక్షేత్రాలు మారుమ్రోగాయి. శివరాత్రి సందర్బంగా మంగళవారం పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడింది.  ఆలయ ఈవో కాదంబరి కేశవరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికీ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. ద్వజ స్థంభం వద్ద దీపాలను వేలిగించారు. డిఎస్పీ ప్రభాకరరావు, వన్ టౌన్ సిఐ కె గోవిందరాజు పర్యవేక్షణలో 3 గురు ఎస్సైలు, 34 పిసిలు, 10 హోంగార్డ్స్, 60 మంది సిపివోస్,  70 ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి వాలంటీర్లతో ప్రత్యేక పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పలువురు దాతలు భక్తులకు ప్రసాదాలను అందించారు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!