• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • కళాశాల అభివృద్దే ధ్యేయం ... గోకరాజు, గాదిరాజు (13/02/18)

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/02/18..  11.00am)
                పేద విద్యార్ధులకు తక్కువ ఫీజుకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. కళాశాలను అభివృద్ధి స్థాయిలోకి తీసుకురావడమే ధ్యేయమని డిఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు(బాబు) అన్నారు. డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన సందర్బంగా మంగళవారం నర్సాపురం పార్లమెంటరీ సభ్యులు గోకరాజు గంగరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు, ఉండి ఎమ్మెల్యే  కలవపూడి శివరామరాజు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను), ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, మాజీ టిటిడి బోర్డు మెంబరు గోకరాజు రాము, పెన్మెత్స జగ్గరాజు, కనుమూరి అప్పల రాజు  తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా గోకరాజు, గాదిరాజు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్ధులకు అవసరమైన కొత్త కోర్సులు ప్రవేశ పెడతామని, క్రీడలకు, ఇతర కార్యక్రామాలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!