• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • కైకాలకు విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..    10.00am)
                      నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది. ఆర్కేబీచ్‌ తీరంలో జరిగిన కార్యక్రమంలో టి సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ వ్యవస్థాపకుడు సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా కైకాల సత్యనారాయణకు బిరుదుతో పాటు బంగారు కంకణాన్ని ప్రదానం చేశారు. సినీ రంగంలో కైకాల చేసిన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు టి సుబ్బరామిరెడ్డి తెలిపారు. సుమారు 780 చిత్రాల్లో నటించిన కైకాలను సత్కరించుకోవటం ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. సినీ, కళా, సామాజిక రంగాల్లో కృషిచేసిన పలువురికి టి సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శివశక్తి అవార్డులను సైతం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!