• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్య కన్నుమూత (14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..    10.00am)
                     కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ బోళ్ల బుల్లి రామయ్య(92) పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుల్లిరామయ్య 1926, జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాక గ్రామంలో జన్మించారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1953 సంవత్సరంలో ఆంధ్రా షుగర్స్ లో చేరిన ఆయన వివిధ హోదాలలో పనిచేసి ఛైర్మన్‌, మేనేజింగు డైరక్టరు స్థాయికి ఎదిగారు. ఆంధ్రా షుగర్స్‌ కర్మాగారంలో ఆరువందల టన్నుల గానుగాట స్థాయి నుంచి ఆరువేల టన్నుల గానుగాట స్థాయికి సాంకేతికంగా అభివృద్ధిపరచటంలో  కీలకపాత్ర వహించారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన వెంటనే 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.1984, 1991, 1996, 1999 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేసి గెలుపొందారు. 1996-98 మధ్య కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాలలో రెండు దశాబ్ధాల పాటు కీలకపాత్ర వహించిన బోళ్ల బుల్లిరామయ్య వివాదారహితుడిగా, సౌమ్యుడిగా, స్నేహశీలిగా గుర్తింపు పొందారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన  మృతి వార్త తెలియగానే ఆంధ్రా షుగర్స్ ‌కుటుంబసభ్యులు, తెదేపా శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
          బుల్లి రామయ్య మృతిపట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మంత్రులు నారా లోకేశ్‌, కామినేని శ్రీనివాస్‌, కళా వెంకట్రావు తదితరులు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!