• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • హరహర నామస్మరణతో సాగిన సోమేశ్వరస్వామి రధోత్సవం (14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..   05.00pm)
                        హర హర.. హరహర అనే శివనామ స్మరణతో గునుపూడి శ్రీఉమా సోమేశ్వరస్వామి రధోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. ఆలయ ఈవో కాదంబరి కేశవరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మేళ తాళాలతో డప్పుల వాయిద్యాలతో  స్వామివారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ బద్దంగా సోమేశ్వరాలయం నుంచి నాచువారి సెంటర్ వరకు రధోత్సవం వైభవంగా సాగింది. రోడ్డు పోడువన మహిళా భక్తులు సోమేశ్వర రదోత్సవానికి హారతులు ఇచ్చారు. వన్ టౌన్ సిఐ కె గోవిందరాజు, ఎస్సై పి అప్పారావు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందో బస్తు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు రధోత్సవం వైభవంగా సాగింది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!