• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ముగిసిన జాతీయ కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాలు (14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..   05.00pm)
                    విద్యార్థులు సామాజిక సేవ మానవసేవపట్ల అవగాహనా కలిగి ఉండాలని, తోటివారిని ప్రేమించి ఆదరించడం మానవత్వమని జిల్లా న్యూక్లియర్ నివారణ వైద్యాధికారి కె ఆనందకుమార్ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, సెయింట్ మేరీస్ లెప్రసీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాలు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్బంగా విద్యార్థులు పలు అంశాల్లో పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికీ బహుమతులు ప్రశంసాపత్రాలను అందించారు. ఆనందకుమార్ మాట్లాడుతూ ఎవరికైనా శరీరంపై స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే ఆస్పత్రిలో సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, డిప్యూటీ పీఎంవో సలాది శ్రీరాములు, నందమూరి రాజేష్, గంధం శ్రీదేవి, సమాంతపూడి మణి, సత్యనారాయణ, రెజ్జి, ఎస్ వెంకట్రాజు, ఆకుల పెద్దిరాజు, శ్రీమన్నారాయణ, రోసి, ఎల్విరా, చిరంజీవి వసురాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!