• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • అంతర్జాతీయ కరాటే పోటీల్లో భీమవరం విద్యార్థులు ప్రతిభ 14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..   05.00pm)
                    బాల్యం నుంచి క్రీడలకు శిక్షణ ఇవ్వడం ద్వారా బావి జీవితంలో క్రమశిక్షణ ఏర్పడుతుందని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను బుధవారం అభినందించారు. నిర్వాహకులు షేక్ సయ్యద్ సుభాన్ మాట్లాడుతూ ఈనెల 2,3 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో భీమవరం ఛాంపియన్ క్లబ్ విద్యార్థులు 8 బంగారు వెండి పధకాలను సాధించారని, అదే విధంగా 8,9 తేదీల్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో 34 బంగారు, వెండి పధకాలను సాధించారని తెలిపారు. కార్యక్రమంలో సుజాత, కొప్పెర్ల ఈశ్వర ప్రసాదరాజు, చంద్రశేఖర్, నందమూరి రాజేష్ పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!