• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత (19/02/18)

    Posted on 18 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/02/18..  
     10.00am)
                   ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా మూత్రం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎస్సార్‌ నగర్‌లోని స్వగృహంలో తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. గుండు హనుమంతరావు 1956, అక్టోబర్‌ 10న విజయవాడలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు మిఠాయి వ్యాపారం చేశారు. అనంతరం ‘సత్యా గ్రహం’చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 400 లకు పైగా సినిమాల్లో నటించారు.‘అహ నాపెళ్లంట’  మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు. బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!