• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • 216 అడుగుల ఎత్తుతో భారీ రామానుజాచార్యుల విగ్రహం

    Posted on 18 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/02/18..  
     10.00am)
                      రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ లోని త్రిదండి చినజీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో పంచలోహాలతో ఏర్పాటు చేస్తున్న భారీ స్వామి రామానుజాచార్యుల విగ్రహం పనులు ప్రస్తుతం తుది దశకు చేరాయి. సుమారు 216 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. స్వామి రామానుజాచార్యుల నిత్యారాధన కోసం 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్నీ శరవేగంగా తయారు చేస్తున్నారు. ఈ రెండింటికి కలిపి  మొత్తం రూ. వెయ్యి కోట్లు వ్యయం చేస్తున్నారు. 216 అడుగుల ఎత్తుతో కొలువుదీరే భారీ విగ్రహం దిగువన సిద్ధమవుతున్న సమతామూర్తి భవనంలో బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. చైనా నుంచి వచ్చిన శిల్పులు, నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. సమతామూర్తి కేంద్రంలో స్వామి రామానుజాచార్యుల సమగ్ర జీవిత చరిత్రను భక్తులు, సందర్శకులకు దృశ్యరూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకూ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!