• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నన్నయ యూనివర్శిటీ సెనేట్ సభ్యునిగా ఎంపికైన సూర్యారావుకు అభినందన సత్కారం (19/02/18)

    Posted on 19 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/02/18..   04.00pm)
                    డిఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎపిటి సూర్యారావు ఆదికవి నన్నయ యూనివర్శిటీ సెనేట్ సభ్యునిగా ఎంపికైన సందర్బంగా సోమవారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్శిటీ ప్రగతిపథంలో ఉందని, ఆదికవి నన్నయ యూనివర్శిటీ సెనేట్ సభ్యునిగా సూర్యారావు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఇదే సందర్బంగా జిడివి ఫౌండేషన్ చైర్మన్ జిడివి రాజశేఖర్ ఖన్నాను సెనేట్ సభ్యునిగా ఎన్నికైన సందర్బంగా ఇరువురిని సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ వోడి ఏ కృష్ణమోహన్, డి సుబ్బరాజు, హరికృష్ణ, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!