• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • రైలు కింద పడి ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

    Posted on 19 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/02/18..   09.30am)
                      కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గుజ్జుల పవన్‌ కల్యాణ్‌ రెడ్డి (20) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగువారి పాలేనికి చెందిన పవన్‌కల్యాణ్‌రెడ్డి విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ, ప్రైవేటు వసతి గృహంలోని ఒక గదిలో మరో ముగ్గురితో కలిసి ఉంటున్నాడు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్‌ వారు కాగా, ఒకతను సీనియర్‌ విద్యార్థి. కళాశాలలో ఇచ్చే కాండక్ట్‌ సర్టిఫికెట్కు సాధారణంగా రూ.3,800లు చెల్లించాలని, అందులో సగం ఇస్తే తాను వాటిని ఇప్పిస్తానని ఇటీవల సీనియర్‌ విద్యార్థి పవన్‌తో చెప్పాడు. దానికి తొలుత ఇతను అంగీకరించాడు. తర్వాత సీనియర్‌ విద్యార్థి అందించే సర్టిఫికెట్ సరైంది కాదని కొందరు చెప్పటంతో తనకు అవసరం లేదని పవన్‌ అతనికి చెప్పాడు. దానికతను అంగీకరించలేదు. తానప్పటికే సంబంధితులతో మాట్లాడానని, ముందుగా అంగీకరించిన మేరకు నగదు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. దీనిపై ఈ నెల 16న రాత్రి వసతిగృహం గదిలో ఇరువురికి గొడవ జరిగింది. మిగిలిన ఇద్దరూ కూడా సీనియర్‌ విద్యార్థికే మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో 17న అన్యమనస్కంగా తరగతులకు హాజరైన పవన్‌ మధ్యాహ్నం తర్వాత కళాశాలకు తిరిగి వెళ్లలేదు. కాగా ఈనెల 18న ఉదయం కొలనుకొండ రైల్వేస్టేషన్‌ దగ్గర అతని మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. మృతదేహం పట్టాల మధ్యలో పడి ఉండగా, మోకాళ్ల కింద భాగం నుంచి రెండు కాళ్లు ఘటనాస్థలిలో లేవు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!