• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • స్కెచ్ సినిమా రివ్యూ (23/02/18)

    Posted on 23 Feb, 2018 in Cinema |   0 Comments

     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/02/18..  04.30pm)
                      చియాన్ విక్రమ్, తమన్నాలు జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్’. తమిళంలో ఇది వరకే రిలీజైన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత తెలుగులో శుక్రవారం విడుదలైంది.  

    కథ:
                 స్కెచ్ (విక్రమ్) వాయిదాలు కట్టని బైకులను, కార్లను ఎత్తుకొచ్చి డబ్బులు వసూలు చేసే దందాలో ముఖ్యుడుగా ఉంటాడు. కొన్నేళ్ల క్రితం ఒక రౌడీ తన యజమాని దగ్గర డబ్బు తీసుకుని కారు కొని వాయిదాలు ఎగ్గొడతాడు. దాంతో యజమాని స్కెచ్ ను ఆ కారును ఎత్తుకు రమ్మని చెప్తాడు. యజమాని మాట మేరకు స్కెచ్ ఆ కారుని ఎత్తుకొస్తాడు. దాంతో కక్ష కట్టిన ఆ రౌడీ స్కెచ్ ను, అతని ముగ్గురు స్నేహితుల్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న రౌడీ వాళ్ళను ఎలా చంపాడు, ఆ రౌడీ పై స్కెచ్ ఎలా పగ తీర్చుకున్నాడు, చివరికి స్కెచ్ జీవితం ఏమైంది అనేదే సినిమా.

    ప్లస్ పాయింట్స్ :
                   సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ సెకండాఫ్. ఇందులోనే అసలు కథ మొదలవుతుంది. హీరో రౌడీతో గొడవ పెట్టుకోవడం, రౌడీ అతని స్నేహితుల్ని టార్గెట్ చేయడం, హీరో విలన్ ను చంపడానికి స్కెచ్ వేయడం, దాన్ని అమలుపరచడం వంటి ముఖ్య అంశాలు ఇందులోనే ఉంటాయి. వీటి తాలూకు సన్నివేశాల్లో కొన్ని బాగానే ఉంటాయి కూడ. ఇంటర్వెల్ ముందు హీరో రౌడీ కారును దొంగిలించే సీన్ బాగుటుంది. చిత్ర క్లైమాక్స్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. అందరికీ స్కెచ్ వేసే హీరోకే కొందరు అనూహ్య రీతిలో స్కెచ్ వేయడం, దాన్ని అమలుపరచడం కొంత థ్రిల్ చేస్తుంది. ఈ అంశంతో ముడి పెట్టి దర్శకుడు ఇచ్చిన సామాజిక సందేశం కూడ కొంత ఆలోచింపజేస్తుంది. ఇక విక్రమ్ తన సహజ నటనతో చాలా చోట్ల ఇంప్రెస్ చేయగా యాక్షన్ సన్నివేశాలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
                 సినిమాలో కొత్తది అనదగిన కథ లేకపోవడమే పెద్ద మైనస్. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం నడిచిన ఫార్మాట్ ను తీసుకుని విజయ్ చందర్ రాసుకున్న కథ, కథనాలు చాలా పాతవిగా, విసిగించేవిగా ఉన్నాయి. సినిమా మొత్తంలో ఒక్క క్లైమాక్స్ మినహా మరే అంశమూ థ్రిల్ చేయలేకపోయింది. కనీసం దర్శకుడు బాగుందనిపించిన ముగింపుకు, సామాజిక సందేహానికి తగ్గట్టే మొదటి నుండి సినిమాను నడిపి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. కానీ అలా చేయకపోవడంతో ఉన్నట్టుండి ఊడిపడే ముగింపును ప్రేక్షకులకు ఎంజాయ్ చేసినా సంపూర్ణంగా ఆమోదించలేరు. మధ్యలో నడిచే లవ్ ట్రాక్ తలా, తోక లేకుండా ఉండటంతో ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అర్థమే కాదు. కనీసం విక్రమ్, తమన్నాల మధ్యన రొమాన్స్ అయినా ఉందా అంటే అదీ లేదు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!