• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • అసువులు బాసిన ఎందరో త్యాగధనులు జాతిచరిత్రలో సువర్ణాధ్యాయం (12/03/18)

    Posted on 12 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 04.30pm)
                  భారత స్వాతంత్ర్యోద్యమ త్యాగ ఘట్టాలు అజరామరమని, అసువులు బాసిన ఎందరో త్యాగధనులు జాతిచరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోయారని, దండి సత్యాగ్రహం మహాత్మాగాంధీ పిలుపుతో మహోద్యమంగా సాగిందని జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సోమవారం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా మహిళా సంఘంలో దండి సత్యాగ్రహ ఉద్యమ స్పూర్తితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా శశి మెరిట్ స్కూల్ డైరెక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ మన స్వాతంత్రోద్యమం ప్రపంచ చరిత్రలో ఒక భాగమని, మహాత్మాగాంధీ దండి సత్యాగ్రహం వాడవాడలా మహోద్యమంగా నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, శశి మెరిట్ స్కూల్, ఎస్ సిహెచ్ బిఆర్ఎం, సర్ సివి రామన్, డిఎన్నార్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!