• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు ఖూనీ చేస్తున్నారు .. మాజీ ఎమ్మెల్యే గ్రంధి (12/03/18)

    Posted on 12 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 04.30pm)
                ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. భీమవరంలోని గ్రంధి శ్రీనివాస్ నివాసరంలో సోమవారం వైఎస్సార్ సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించిందని, నేడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర మరోసారి భరోసా కల్పించే దిశగా కదులుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉంటున్న  వైఎస్‌ జగన్‌ ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నైజాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉమాబాల, కోడె యుగంధర్, కౌన్సిలర్ మంగ, రాయప్రోలు శ్రీనివాస్, చెన్ను చంటి, గంట సుందర్ కుమార్, పేరిచర్ల సత్యనారాయణ రాజు, గాదిరాజు తాతారాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!