• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • అమరావతిలో పవన్‌కల్యాణ్‌ నివాసం .. భూమిపూజ చేసిన పవన్ (12/03/18)

    Posted on 12 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 04.30pm)
                    జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. మురగన్‌ హోటల్‌ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.   అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. భవిష్యత్తులో దీన్ని పార్టీ కార్యాలయంగానూ  వినియోగించుకునే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం.  సతీసమేతంగా భూమి పూజలో పాల్గొన్న పవన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి జనసేనాని కౌంటర్ ఇచ్చారు. జనసేన టీడీపీలో అంతర్భాగమని, జనసేనకు కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనంటూ జగన్ చేసిన విమర్శలను పవన్ తిప్పికొట్టారు. ‘జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ అనుకోవాలా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక మాట అనడం సులభమని, రాజకీయ నేతలు ఆలోచించి మాట్లాడాలని పవన్ సూచించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!