• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఫ్లడ్‌లైట్లు వెలుగుల్లో 31వ ఫెడరేషన్‌ కప్‌ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు (12/03/18)

    Posted on 13 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 07.30pm)
           ఫ్లడ్‌లైట్లు వెలుగుల్లో 31వ ఫెడరేషన్‌ కప్‌ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు భీమవరం కాస్మో పాలిటన్‌ క్లబ్‌ ఆవరణలో హోరాహోరీగా సాగాయి. పోటీల్లో పురుషుల విభాగంలో తొలి మ్యాచ్‌లో హరియాణా జట్టు ఆంధ్రప్రదేశ్‌ పై గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో ఇండియన్‌ యూనివర్సిటీస్‌ జట్టు సర్వీసెస్‌ జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో మూడో మ్యాచ్‌లో కేరళ జట్టు ఆంధ్రప్రదేశ్‌ జట్టుపై, నాలుగో మ్యాచ్‌లో తమిళనాడు జట్టు మహారాష్ట్రపై విజయం సాధించింది. వాలీబాల్‌ అభిమానుల పోటీలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో అభిమానులు పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. టోర్నీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డీవీ సుబ్బరాజు, సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరావు, దాట్ల శ్రీనివాసరాజు (డీఎస్‌), నారాయణ రాజు, కాస్మో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తటవర్తి కృష్ణబాబు, సంయుక్త కార్యదర్శి అల్లూరి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!