• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • ఎంపీల పోరాటానికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీలు .. సీఎం చంద్రబాబు (13/03/18)

    Posted on 13 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/03/18.. 10.00am)
                విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంటు వేదికగా ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాడాలన్నారు. అసెంబ్లీ, మండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు. అంతేగాక పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా కలుపుకోవాలన్నారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చారు.. ఈరోజు సెంటిమెంటు చూసి డబ్బులు ఇవ్వలేమంటారా..? ఇదేం న్యాయం..? అని చంద్రబాబు అన్నారు. మా డిమాండ్లు హేతుబద్ధమైనవని, ఇచ్చిన హామీలు అమలు చేయాలనడం అహేతుకమా..? అంటూ చంద్రబాబు అన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!