• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • వైభవంగా శ్రీవారి ఆలయంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం (13/03/18)

    Posted on 13 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/03/18.. 11.00am)
             తిరుమల శ్రీవారి ఆలయశుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరు మంజనం మంగళవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ నెల 18న ఉగాది ఆస్థానం జరగనున్న నేపథ్యంలో తితిదే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం నిలిపివేసి ఆలయ అధికారులు, సిబ్బంది మహాయజ్ఞంలా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 11 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీవారికి పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!