• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • హోరాహోరీగా 31వ ఫెడరేషన్‌ కప్‌ వాలీబాల్‌ ఛాంపియన్ పోటీలు (13/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/03/18.. 07.30pm)
               భీమవరం కాస్మో క్లబ్‌ ఆవరణలో ఫెడరేషన్‌ కప్‌ వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు మంగళవారం కర్ణాటక, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఇండియన్‌ రైల్వేస్‌, ఇండియన్‌ యూనివర్సిటీస్‌ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజేతలు వీరే .. పురుషుల విభాగంలో కర్ణాటక జట్టు కేరళ జట్టుపై, రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు ఆంధ్రప్రదేశ్‌ పై, ఇండియన్‌ యూనివర్సిటీస్‌ హర్యానాపై, మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. టోర్నీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డీవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ క్రీడాకారుడికి రూ.5 వేలు నగదు బహుమతి  అందజేస్తున్నారు. కాస్మో పాలిటన్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రాము, తటవర్తి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి అల్లూరి పద్మరాజు, జిల్లా సంఘం ప్రతినిధులు డి.శ్రీనివాసరాజు(డీఎస్‌), నారాయణరాజు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!