• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలి (14/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18..   04.30pm)
               పురాతన సంప్రదాయాలలో రంగవల్లులు ప్రధానమని, వాకిళ్ళ ముందు ముగ్గువేయడం మన భారతీయ సంస్కృతిని, పండుగలలో జాతీయ సమైక్యత భావంతో రంగవల్లుల పోటీలు నిర్వహించడం ఒక శుభపరిణామమని ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు గంధం శ్రీదేవి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా బుధవారం డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం నిర్మలాదేవి మాట్లాడుతూ ఉగాది స్పూర్తితో భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి,  హిమబిందు, శిరీష, ఎం శ్రీవాణి, సరోజినీ దేవి, శ్రీవల్లి, శివ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!